- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజంగా ఈ ఆర్టీసీ కండక్టర్ మనసు ‘బంగారం’
దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాలలో ఓ మహిళా ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి గొప్ప మనసు చాటుకుంది. అయితే నిన్న రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రయాణించింది. తన స్టాప్ రాగానే మహిళ బస్సులోనే బ్యాగ్ మరిచి దిగిపోయింది. అనంతరం బ్యాగును గమనించిన కండక్టర్.. బ్యాగులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చింది. జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను సంబంధిత ప్రయాణికురాలికి అప్పగించారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. నిజాయితీగా తన బంగారు ఆభరణాలను అందించిన కండక్టర్ వాణికి, డ్రైవర్ తిరుపతికి ప్రయాణికురాలు భవాని ధన్యవాదాలు తెలిపారు.