- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జూనియర్ డాక్టర్లకు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్!
దిశ, క్రైం, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో జూనియర్ డాక్టర్లకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దూల్ పేటకు చెందిన సురేష్ సింగ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ లోని జూనియర్ డాక్టర్లకు మత్తుపదార్ధాలు విక్రయిస్తున్నట్లు యాంటీ నార్కొటిక్ బ్యూరో కు సమాచారం అందింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు కోటి పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 80 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దాదాపు 8 మంది జూనియర్ డాక్టర్లకు గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో డా. కే మణికందన్, డా. వి అరవింద్ లు ఉన్నారని, మరి కొందరి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. నిందితుడికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకా ఎవరికి సప్లై చేస్తున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.