- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. పేరు ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న వేళ తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ రాబోతోంది. తెలంగాణ ప్రజలతో ఇన్నాళ్లు మమేకమైన టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ అనే అక్షరాలు కలిసి వచ్చేలా తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రాజ్యసమితి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆలోచనలు జరుగుతున్నాయనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్యనేతలు టీఆర్ఎస్ అనే అక్షరాలు కలిసి వచ్చేలా పార్టీకోసం పక్కా ప్రణాళికలు రచిస్తున్నారనే టాక్ జోరందుకుంది.
ఈ ముగ్గురు కూడా గతంలో ఉన్నతమైన పదవులు అనుభవించిన వారే అనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ ముగ్గురు నేతలు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. జెండా, రంగు, ఏంటన్న దానిపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతోందని తెలంగాణ సెంటిమెంట్ ను రంగరిచి ఈ పార్టీకి పురుడుపోసే వ్యూహం కనిపిస్తోందనే ప్రచారం వినిపిస్తోంది. వివిధ పార్టీల్లోని అసంతృప్తులను కొత్త పార్టీలో చేర్చుకునే దిశగా ఈ ప్రణాళిక జరగుతోందని ఇప్పటికే కొంత మంది నేతలు వారితో టచ్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పురుడు పోసుకుంటే ఆ పార్టీ ఎవరికి మేలు చేస్తుంది మరెవరికి నష్టం కలిగిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది..
Also Read...
‘ఆ రాష్ట్రాల్లో MIM పోటీ చేయలేదు. అయినా కాంగ్రెస్ ఓడిపోయింది’