హైదరాబాద్ లో మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం.. రెండు గంటలుగా కస్టమర్ల ఇక్కట్లు

by Javid Pasha |   ( Updated:2023-08-05 11:46:39.0  )
హైదరాబాద్ లో మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం.. రెండు గంటలుగా కస్టమర్ల ఇక్కట్లు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో ఉదయం నుంచి కస్టమర్లు ఇబ్బందిపడుతున్నారు. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో ఎయిర్ టెల్, జియో కస్టమర్లు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య రెండు గంటలుగా మరీ ఎక్కవకావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్స్ కనెక్ట్ కాకపోవడంతో తమవాళ్లతో మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియక వాళ్లంతా అయోమయానికి గురువుతున్నారు.

ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇదే సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జియో నెట్వర్క్ ఈ సమస్యను కొంత పరిష్కరించినప్పటికీ.. ఎయిర్ టెల్ మాత్రం ఇంకా నెట్వర్క్ ఇష్యూని పరిష్కరించలేదు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని, ఇంకో గంటలో నెట్వర్క్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జియో, ఎయిర్ టెల్ ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed