బీఆర్ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డేట్ ఫిక్స్.. వాటిపైనే ఫోకస్

by Vinod kumar |   ( Updated:2023-05-15 14:14:01.0  )
బీఆర్ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డేట్ ఫిక్స్.. వాటిపైనే ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనుంది. సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని అధినేత సూచించారు. కర్నాటక ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏమేరకు ప్రభావం పడనుందనే వివరాలను సమీక్షించనున్నట్లు సమాచారం.

జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవరణ వేడుకలు, అమవీరుల స్మారకం ఆవిష్కరణ, మూడునెలలపాటు పార్టీ శ్రేణులకు కార్యచరణ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనేదానిపై ప్రధానం నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.

Also Read..

నిజాంపేట్ లో రూ. 2 వేల కోట్ల కుంభకోణం: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Advertisement

Next Story