- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atrocious: భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి.. కారణం ఇదే..!
దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటో నడవడం లేదని ఓ ఆటో డ్రైవర్ తన భార్యకు ఉరి వేసి తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలపడ్డారు. ఈ విచారకర సంఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌లోని ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన స్వామి (45) దేవలక్ష్మి (40) దంపతులు. వీరికి మల్లికార్జున్ అనే ఒక కొడుకు ఉన్నారు.
మల్లికార్జున్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కాగా స్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అయితే మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో నడక, చేసిన అప్పులు తీర్చలేక స్వామి నిన్న (బుధవారం) తన భార్యకు ఉరి వేసి తాను కూడా ఉరి వేసుకుని చనిపోయారు.
అయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మల్లికార్జున్ పరీక్షలు ముగియడంతో కళాశాలకు సెలవలు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తియ్యగానే విగత జీవులుగా పడిఉన్న తల్లిదండ్రులను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇక విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా స్వామి బలవన్మరణానికి ముందు తన ఆత్మహత్యకు కారణాన్ని సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డ్ చేశాడు. రేవంత్‌రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకురావటంతో ఆటో నడవటం లేదని, దీంతో ఇబ్బందులతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. తనను నమ్మి వచ్చిన భార్యను కష్టాల్లో వదిలి వెళ్లలేక తన భార్యను చంపి తాను చనిపోతున్నట్లు తెలిపారు.
తన కొడుకుని బాగా చూసుకోవాలని తన చెల్లిని కోరారు. తన కుమారుడి పోషణకు తన ప్లాట్ తీసుకోవాలని.. తమ అంత్యక్రియల కోసం చందాలు వేసుకోవద్దని, తన భార్య నగలు అమ్మి అంతిమ సంస్కారాలు చేయాలని విన్నవించాడు.