జూరాల ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

by M.Rajitha |
జూరాల ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో జలాశయాల గేట్లు కొట్టుకుపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా గత రెండు రోజుల క్రితం తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి నీరంతా దిగువకు వృథాగా పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు భద్రతపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులోని చాలా గేట్లకు లీకేజీలు ఏర్పడి నీరు కిందకి వృథాగా పోతోంది. తక్షణమే ఈ ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టాలని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే 2021 లో ప్రభుత్వం కొన్ని నిధులు మాత్రమే కేటాయించగా.. సాంకేతిక సమస్యలతో.. నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వంటి సమస్యలతో మొత్తం 62 గేట్లలో కేవలం 5 గేట్లకు మాత్రమే మరమ్మత్తులు జరిపామని జూరాల ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికీ చాలా గేట్లలో లీకేజి సమస్య ఉందన్నమాట వాస్తవమేనని, ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే అన్ని గేట్లకు మరమ్మత్తులు చేస్తామని పేర్కొన్నారు. కాగా తుంగభద్ర వంటి భారీ జలాశయం నిర్లక్ష్యం జూరాల విషయంలో చేయకుండా వెంటనే స్పందించి, జూరాలను కాపాడాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed