బీజేపీ కండువా కప్పుకోనున్న కీలక నేత

by Anjali |
బీజేపీ కండువా కప్పుకోనున్న కీలక నేత
X

దిశ, మెట్టుగూడ: సికింద్రాబాద్‌లో కీలకనేతగా ఉన్నటువంటి సీనియర్‌ రాజకీయ నాయకుడు అదం విజయ కుమార్ ఈరోజు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా మార్చుకుంటానని అదం విజయ్ స్వయంగా వెల్లడించారు. తెలంగాణలో BRS ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్న అదం విజయ్, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించదని హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం తుకారంగేట్(సికింద్రాబాద్) లోని తన నివాసం నుండి అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

అదం విజయ రాకతో సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీజేపీకి అదనపు బలం చేకూరనుంది, గతంలో NSUI, యూత్ కాంగ్రెస్ లో కీలకనేతగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీతాఫలమండి(సికింద్రాబాద్) కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. YS జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు YSRCP లో చేరి గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్ష పదవి చేపట్టాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి YSRCP అభ్యర్థిగా పోటీచేశారు.

Advertisement

Next Story