వరంగల్ మెడికో ప్రీతి చెల్లెలు పూజకు ఉద్యోగం

by GSrikanth |   ( Updated:2023-05-20 14:39:55.0  )
వరంగల్ మెడికో ప్రీతి చెల్లెలు పూజకు ఉద్యోగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వరగల్ జిల్లాకు చెందిన మెడికో ప్రీతి సూసైడ్ వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతి చెల్లెలు పూజకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. హెచ్ఎండీఏ ఐటీ సెల్ లో కాంట్రాక్టు బేసిస్ లో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతి సీనియర్ వేదింపులు తాళలేక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమయంలో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రీతి సోదరికి ఉద్యోగం కల్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed