మంచిర్యాల జిల్లా కేంద్రంలో బయటపడ్డ భారీ కుంభకోణం!

by Disha Web Desk 5 |
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బయటపడ్డ భారీ కుంభకోణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ కుంభకోణాన్ని పోలీసులు చేదించారు. నకిలీ వేలిముద్రలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకం నిధులు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు కేంద్రం స్కిల్ డెవలెప్ మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తుంది. ఈ కోర్సుల్లో జాయిన్ అయిన అభ్యర్ధుల హజరు శాతం ఆదారంగా ఒక్కో అభ్యర్ధికి రూ.3 వేల చొప్పున కేంద్రం ఇస్తుంది. ఈ నేపధ్యంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్ లో 300 మంది అభ్యర్ధులు పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ రోజుకు 50 మంది చొప్పున మాత్రమే హాజరవుతున్నారు.

హజరు కాని అభ్యర్ధుల వేలు ముద్రలు సేకరించి క్లోనింగ్ ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేసి, వాటిని బయోమెట్రిక్ మిషన్ లో హజరు నమోదు చేశారు. ఈ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపడంతో నిధులు మంజూరు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న రామగుండం సీపీ.. ఈ అంశంపై విచారణకు టాస్క్ ఫోర్స్ బృందాన్ని పంపారు. దీంతో మంచిర్యాల సెంటర్ లో సోదాలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ బృందం.. ఇన్ చార్జ్ గా ఉన్న దేవేందర్ ను అరెస్ట్ చేసి విచారించడంతో అసలు విషయం బయటపడింది.

క్లోనింగ్ ద్వారా నకిలీ వేలు ముద్రలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ నిధులు కాజేశారని పోలీసులు బయటపెట్టారు. దీనికి సంబందించి కార్యాలయ రికార్డులను, నకిలీ వేలిముద్రలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న హైదరాబాద్ కు చెందిన మల్లకార్జున్, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేష్, దేవేందర్ అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబందించి ప్రధాన సూత్రధారులుగా ఉన్న భూపాల్ కు చెందిన సాహిల్, హైదరాబాద్ కు అవునూరి శ్రీనివాస్ లను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed