- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుంరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 'ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు' తీర్పును వెలువరించింది.
ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రతివాదులంతా అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశిందించి. ఈ తర్వాత ఆరు వారాల్లో సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.