India vs England Match: గ్రౌండ్‌లో అనూహ్య ఘటన.. రోహిత్ శర్మ కాళ్లకు దండం పెట్టిన అభిమాని (వీడియో)

by srinivas |   ( Updated:2024-01-25 10:31:58.0  )
India vs England Match: గ్రౌండ్‌లో అనూహ్య ఘటన..  రోహిత్ శర్మ కాళ్లకు దండం పెట్టిన అభిమాని (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ మధ్యలో అనూహ్య ఘటన జరిగింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటింగ్ ఆరంభం వేళ ఒక్కసారిగా మైదానంలోకి అభిమాని దూసుకెళ్లారు. క్రీజులో ఉన్న రోహిత్ శర్మ వద్దకు నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు.వెంటనే రోహిత్ శర్మ కాళ్లకు దండం పెట్టారు. రోహిత్ శర్మ కాళ్లు మొక్కుతూ ఆ అభిమాని పెద్దపెద్దగా అరుపులు, కేకలు వేశారు. అయితే రోహిత్ శర్మ అభిమానిని ఏమీ అనలేదు. తన చేతులతో పైకి లేపారు. దీంతో అభిమాని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అభిమానిని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో మ్యాచ్ కొంతసమయం నిలిచిపోయింది. అనంతరం తిరిగి రోహిత్ శర్మ బ్యాటింగ్ కొనసాగించారు.


కాగా గురువారం ఉదయం India vs England మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్ కొనసాగిస్తున్న భారత్ ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (42), యశస్వీ జైశ్వాల్ (23) పరుగులు చేశారు. ప్రస్తుతం వీరి బ్యాటింగ్ కొనసాగుతోంది.

Advertisement

Next Story