- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral News: కానరాని లోకానికి తరలి వెళ్లిన ‘పొట్టి’.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది పెంపుడు జంతువులను ఇంట్లో మనుషులతో సమానంగా పెంచుకుంటారు. వాటికి చిన్న దెబ్బ తగిలిన తల్లడిల్లిపోతుంటారు (Animal Lover) జంతు ప్రేమికులు. పెంపుడు జంతువులు చనిపోతే అంత్యక్రియలు సైతం చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగిన పొట్టి (పిల్లి) కానరాని లోకానికి తరలి వెళ్లడంతో.. ఆ ఇంటి సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో ఉండిపోయారు.
భారత్‌లో పిల్లుల జీవితకాలం 14 నుంచి 16 ఏళ్లు మాత్రమే.. కానీ తమ పొట్టి మాత్రం 21 ఏళ్లు జీవించి రికార్డు నెలకొల్పిందని ఆ ఇంటి పెద్ద చారి చెబుతున్నారు. 2004 సెప్టెంబర్ 19న హైదరాబాద్ అంబర్‌పేట్ పటేల్‌నగర్‌లో ఈ పొట్టి (CAT) జన్మించింది. దానిని 20 ఏళ్ల పాటు ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిలానే చూసేవారు. 2011లో అర్ధరాత్రి ఇంటి పెద్ద శ్రీదేవి ఛాతీ నొప్పితో బాధపడుతుంటే పొట్టి గమనించి మిగతా కుటుంబ సభ్యులను నిద్ర లేపి ఆమె ప్రాణాలు కాపాడింది. ఇలా ప్రతివిషయంలోనూ కుటుంబ సభ్యులకు ఎంతో దగ్గరైన పొట్టి సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో జూలూరు శ్రీదేవి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.