- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్య వ్యవహారంలో నితీష్ కుమార్, కేసీఆర్ మధ్య డీల్ ? : బండి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్, నితీష్ కుమార్ పై బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో గ్యాంగ్ స్టార్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణయ్యను హత్య చేసిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్‌కు వస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయని, అదే నిజమైతే పాలమూరు బిడ్డను చంపిన హంతకుడిని తెలంగాణలోకి రానివ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్‌ను శిక్షా కాలం పూర్తి కాకముందే నితీష్ కుమార్ ప్రభుత్వం విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. నితీష్ కుమార్ తీరుపై ఇంతవరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా బండి సంజయ్ నిలదీశారు. మరోవైపు, అతీక్ అహ్మద్ హత్యను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కృష్ణయ్య.. హంతకుడి రాకపై ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో నితీష్, కేసీఆర్ మధ్య ఏమైనా డీల్ ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కృష్ణయ్యను హత్య చేసిన హంతకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వొద్దని, లేదంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read..
సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం.. రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..!
విపక్షాలకు ఆయుధంగా కేసీఆర్ వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై బండి సంజయ్ సీరియస్