సీఎం రేవంత్ ఆదేశాలతో యూట్యూబర్ పై కేసు నమోదు

by Jakkula Mamatha |
సీఎం రేవంత్ ఆదేశాలతో యూట్యూబర్ పై కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: ఫన్ పేరుతో చిన్న పిల్లలపై అసభ్యకరమైన జోకులు వేస్తూ తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో, ఆ వీడియో పై టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ చేసిన అభ్యర్థన మేరకు తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. దీనిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..ఏపీకి చెందిన ప్రముఖ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీకూతుళ్ల బంధం పై అతడితో పాటు మరికొందరు యూట్యూబర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరలైంది. హీరో సాయిధరమ్ తేజ్ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story