కుక్కను చావగొట్టిన దంపతులు.. కేసు నమోదు

by GSrikanth |   ( Updated:2023-10-16 07:04:51.0  )
కుక్కను చావగొట్టిన దంపతులు.. కేసు నమోదు
X

దిశ, రాచకొండ: పాత కక్షలు మనసులో పెట్టుకుని నోరు లేని మూగ జీవిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని శునకాన్ని(కుక్క) పెంచుకుంటున్న యజమాని రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివారులో పీర్జాదిగూడ, పార్వతపూర్ ప్రాంతానికి చెందిన సోమా నరేష్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. నరేష్ దంపతులు ఓ కుక్కను పెంచుకున్నారు. రెండు రోజుల కిందట నరేష్ కుక్క (బ్రౌని) వీధిలో తిరుగుతూ రవి అనే మరో వ్యక్తి ఇంటికి వెళ్ళింది. దీంతో రవి దంపతులు ఆ కుక్కను కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బ్రౌని చికిత్స అనంతరం మరణించింది. ఇది తట్టు కోలేని నరేష్ దంపతులు తమతో ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకుని మా బ్రౌనిపై దాడి చేసి చంపేశారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుక్కపై దాడిచేసి హతమార్చడంపై రవి దంపతుల మీద కేసు నమోదు చేశారు. కుక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement

Next Story