BREAKING: షాద్ నగర్‌లో ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు

by Ramesh N |   ( Updated:2024-05-10 13:32:16.0  )
BREAKING: షాద్ నగర్‌లో ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, నటి నవనీత్ కౌర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. దీంతో షాద్‌నగర్‌లో నవనీత్ కౌర్‌పై కేసు నమోదు అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె షాద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో తాజాగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న నవనీత్ కౌర్ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అది సీదా పాకిస్తాన్‌కు వేసినట్టే’ అని నవనీత్ కౌర్ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఫైయింగ్ స్క్వాడ్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌‌లో నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణలో నవనీత్ కౌర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అంటూ ఓవైసీకి నవనీత్ కౌర్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో నవనీత్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


Advertisement

Next Story