ఎలక్షన్ ఎఫెక్ట్: బీజేపీ కార్పొరేటర్​ వంగా మధుసూదన్ ​రెడ్డిపై కేసు నమోదు

by Satheesh |   ( Updated:2023-11-14 15:39:48.0  )
ఎలక్షన్ ఎఫెక్ట్: బీజేపీ కార్పొరేటర్​ వంగా మధుసూదన్ ​రెడ్డిపై కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను బీజేపీ కార్పొరేటర్‌తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్​ సదన్​ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికి సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్​ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణాధికారి లేదా కోర్టులో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ కార్పొరేటర్​ వంగా మధుసూదన్​రెడ్డి, తన​ అనుచరుడైన శ్రీనివాస్ ​రెడ్డితో కలిసి మంగళవారం చంపాపేట మారుతీనగర్ స్ట్రీట్​ ​నెంబర్​1లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇది గమనించిన ఎన్నికల అధికారి బాగల్​కోట్ ​శ్రీకాంత్​ ఐఎస్​ సదన్​ పోలీసులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో మారుతీనగర్ వెళ్లిన పోలీసులు అక్కడ జరిపిన విచారణలో వంగా మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇంటింటి ప్రచారం చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిపై ఐపీసీ 341, 188, 171(హెచ్), సీపీ యాక్ట్​ సెక్షన్​21/76 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇద్దరికి సీఆర్పీసీ యాక్ట్​ సెక్షన్​41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేశారు. కేసును సీఐ మల్లేష్​దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

కేసీఆర్.. అంటే ఆగడు.. పంటే లేవడు: ఎంపీ లక్ష్మణ్ సెటైర్

Advertisement

Next Story