- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులా?: బండి
X
దిశ, ముధోల్ : పోరాటం చేస్తున్న విద్యార్థులపై సీఎం కేసీఆర్ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నాడన్నారు. మంగళ వారం ముధోల్ తాలూకా కుభీర్ మండలం చాత గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ ఫుడ్ పాయిజన్ అవ్వడం బాధించిందన్నారు. విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాటం చేస్తే వారిని చదువుకోకుండా బెదిరిస్తూ, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు హాస్పిటల్‌కు తీసుకెళ్తే తాను బదనాం అయిత అని చెప్పి, వాళ్ళను తీసుకెళ్ళకుండా ప్రాణాలతో చెలగాటలాడుతున్నాడని మండిపడ్డారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే సంగతి చూస్తామని కేసీఆర్ ను హెచ్చరించారు.
Advertisement
Next Story