Tiger : నిర్మల్ జిల్లాలో పెద్దపులి ఎటాక్.. ఓ ప్రాణం బలి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-12 11:45:21.0  )
Tiger : నిర్మల్ జిల్లాలో పెద్దపులి ఎటాక్.. ఓ ప్రాణం బలి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ (Joint Adilabad) జిల్లా వాసులను పెద్దపులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి.నిర్మల్ జిల్లా పెంబి మండలంలో సంచ‌రిస్తున్న పెద్ద పులి(Tiger) ఎద్దుపై దాడి చేసి చంపేసింది. మండ‌లంలోని బుర్క రేగిడిలో జరిగిన ఈ ఘటనతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ మామడ రేంజ్ అధికారి అవినాష్,పెంబి రేంజ్ అధికారి రమేష్‌రావు, ఫ్లయింగ్ స్క్వాడ్ చోలే అనిత లు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. ఎద్దుపై దాడి చేసిన పులి పాద‌ముద్రలు గుర్తించారు. పెంబి మండ‌లంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజాగా నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద పులి రోడ్డు దాటుతూ వాహనదారుల కంట పడింది. ఇన్నాండ్లుగా చిరుతలు సంచరిస్తు పలు చోట్ల పశువులను చంపి తింటుండగా.. తాజాగా పెద్దపులులు సైతం పశువులపై దాడి చేస్తుండటం జిల్లా ప్రజలను, రైతులను కలవరపెడుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల నుంచి పెద్దపులులు జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు అటవీశాఖ అధికారులు పులులు, చిరుతల సంరక్షణ కోసం చర్యలు ప్రారంభించారు. వారం రోజుల క్రితం తిప్పేశ్వర్ నుంచి వచ్చిన పులి మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో మూడు ఆవులను, హాజీపూర్ మండలంలో రెండు గొర్రెలను చంపేసింది.

Advertisement

Next Story

Most Viewed