- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నేత వీహెచ్ జీవిత చరిత్రపై పుస్తకం.. టైటిల్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: 50 ఏళ్ల తన అనుభవంలో విద్యార్థి, యూత్ కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో తన జీవిత చరిత్రపై పుస్తకం రాస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘హనుమంతుడు అందరి వాడే’ పేరుతో పుస్తకం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే తరం వారికి తెలియాలని బుక్ రాస్తున్నట్లు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది.. పోయిందన్నారు. తనతో కేసీఆర్, చంద్రబాబు పని చేశారని వచ్చే తరానికి తెలియాలన్నారు. సంజయ్ గాంధీ ఆలోచనతో ఓల్డ్ సిటీలో 50 రోజులు తిరిగారని, రాజీవ్ గాంధీ తనను పీసీసీ అధ్యక్షుడిని చేశారని గుర్తుచేశారు.
తను సహాయం చేసిన వారి గురించి కూడా పుస్తకంలో రాశారని, రాజకీయంగా ఎదుగుదల.. నష్టం కూడా ఆ బుక్‌లో రాశానని వెల్లడించారు. వచ్చే నెల 7 వ తేదీన ఇందిరాపార్కు వద్ద వెంకటరామిరెడ్డి హల్‌లో పుస్తక ఆవిష్కరణ ఉంటుందని, దీనికి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, కర్ణాటక మంత్రి బోసురాజు, దీపాదాస్ మున్షీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. నాయకుల వెంట తిరిగితే పదవులు రావని, గ్రామాల్లో తిరగండి కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారకుండా ఉన్న పార్టీలోనే ఎదగాలని, ఉన్నా పార్టీలోనే చచ్చేవరకు ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు సెక్రటరీయట్, అంబేద్కర్ విగ్రహం సింబాలిక్‌గా ఉందని, రైతు ఆత్మహత్యలు, ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం జరిగితే అక్కడ తను పోరాడారని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హన్మంతరావు ఉంటారని అన్నారు.