తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్లలో 8 మంది వాళ్లే

by Javid Pasha |   ( Updated:2023-05-25 07:42:46.0  )
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్లలో 8 మంది వాళ్లే
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 94.11 శాతం మంది పరీక్షకు అర్హత సాధించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇక ఈ ఫలితాలలో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో టాప్ 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులను ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 5 ర్యాంకర్లలో నాలుగు ర్యాంకులు ఏపీ విద్యార్థులే సాధించారు. మొదటి ర్యాంకు సాధించిన ఎస్.అనిరుధ్ (విశాఖపట్నం), 2వ ర్యాంకు సాధించిన వై.మనీందర్ రెడ్డి (గుంటూరు), 3వ ర్యాంకు సాధించిన సీహెచ్.ఉమేశ్ వరుణ్ (క్రిష్ణా జిల్లా), 5వ ర్యాంకు సాధించిన పి.ప్రమోద్ కుమార్ రెడ్డి (అనంతపురం) ఏపీకి చెందినవాళ్లే.

ఇక అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన బి.జశ్వంత్ (ఈస్ట్ గోదావరి), 2వ ర్యాంకు సాధించిన ఎన్.వెంకటతేజ (చీరాల), 4వ ర్యాంకు సాధించిన డి.కార్తికేయ రెడ్డి (తెనాలి), 5వ ర్యాంకు సాధించిన బి.వరుణ్ చక్రవర్తి (శ్రీకాకులం) కూడా ఏపీకి చెందినవాళ్లే. కాగా టీఎస్ ఎంసెట్ మొత్తం సీట్లలో 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయించారు.

Advertisement

Next Story

Most Viewed