- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ!
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. అయితే మాకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సీఎంను ఉచిత విద్యుత్ కావాలని అడిగింది. ‘‘ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి’’ అని కోరుతూ లేఖ రాసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విద్యార్థిని లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.