Prajavani applications : ప్రజావాణికి 5.23 లక్షల దరఖాస్తులు.. ఎన్ని పరిష్కరించారంటే?

by Ramesh N |   ( Updated:2024-08-06 12:46:23.0  )
Prajavani applications : ప్రజావాణికి 5.23 లక్షల దరఖాస్తులు.. ఎన్ని పరిష్కరించారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రజావాణి అనే వేదికను కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువల వస్తున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు అన్ని జిల్లాల నుంచి 5,23,940 అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ఒక్క ప్రజా‌భవన్‌లోనే 60 వేల అర్జీలు వచ్చాయి. ఇందులో 4,31,348 అర్జీలు పరిష్కరించారని, 92,592 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని తెలిసింది. ఈ దరఖాస్తుల్లో ఎక్కువగా కొత్త రేషన్ కార్డులు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్ల గురించే విజ్ఞప్తులు వచ్చాయి.

ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు అక్కడికక్కడే పరిశీలిన చేస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మ జ్యోతిభాఫూలే భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం పెడుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్జీదారులు ఇచ్చే దరఖాస్తుల తక్షన పరిష్కారానికి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వచ్చిన అప్లికేషన్లను వెంట వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పటి కప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నారు.

Advertisement

Next Story