రూ.363 కోట్ల మేరకు పంచాయతీరాజ్, 500 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసం

by M.Rajitha |
రూ.363 కోట్ల మేరకు పంచాయతీరాజ్, 500 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాల కారణంగా.. మొత్తం 117 గ్రామాల‌కు వెళ్ళేటువంటి పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతినగా, మ‌రో 80 గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. అయితే, వీటి రిపేర్ కోసం రూ.363 కోట్లు అవుతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 500 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు పాడయ్యాయని తెలిపారు. అయితే, రిపేర్లు అయ్యేదాకా, గ్రామీణ ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా శాఖ ప‌రంగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ప్రారంభించాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. అయితే, ఈ నష్టం అత్యధికంగా ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 33 గ్రామాలకు వెల్లే ర‌హ‌దారులు దెబ్బతిన‌గా, క‌రీంన‌గ‌ర్లో 20 గ్రామాల రోడ్లు పాడ‌య్యాయి. 20 గ్రామాల‌కు సంబంధాలు క‌ట్ అయ్యాయి. మ‌హ‌బూబ్ బాద్ లో 30 గ్రామాలు, ఉమ్మడి మెద‌క్ లో 8 గ్రామాల‌కు, నిజామాబాద్ లో 7 గ్రామాలకు, న‌ల్గొండ లో 4 గ్రామాల‌కు వెల్లే ర‌హ‌దారులు కొట్టుక‌పోయాయి. ఇప్పటి వ‌ర‌కు క్షేత్రస్థాయి నుంచి అందిన స‌మాచారం మేర‌కు మొత్తం 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీట మున‌గ‌డంతో డామేజ్ ఎక్కుగా జరిగిందని అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాలు ముగిసిన వెంటనే యుద్ద ప్రాతిప‌దిక‌న గ్రామీణ ర‌హ‌దారుల పునురుద్దర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. వ‌ర్షం త‌గ్గిన త‌ర్వాత అంచ‌నాలు సిద్దం చేసి దెబ్బతిన్న గ్రామాల మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారిచేశారు. వీలైనంత త్వర‌గా తాత్కలిక ప్రాతిప‌దిక‌నైనా గ్రామీణ ర‌హ‌దారుల మ‌ర‌మ్మత్తులు చేప‌ట్టి, పున‌రుద్దర‌ణ ప‌నుల‌ను పూర్తి చేస్తామ‌ని పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఈఎన్సీగా కనకరత్నం తెలిపారు. వ‌ర్షం త‌గ్గు ముఖం ప‌ట్టగానే ప‌నులు ప్రారంభిస్తామ‌ని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed