- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్బీ స్టేడియానికి 300 మంది అమరుల కుటుంబాలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అపూర్వ ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1: 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తారు. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ నేతలను ఆహ్వానించారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌లోని మాజీ సీఎంలు, గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన ప్రముఖులు రానున్నారు. వారితో పాటు 300 మంది అమరవీరుల కుటుంబాలకు కూడా టీపీసీసీ ఆహ్వానం పంపింది. మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.