- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ట్రెండ్ కొనసాగిస్తున్న 27 సెగ్మెంట్లు.. కాంగ్రెస్ సెన్సెషనల్ స్కెచ్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. వరుసగా రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడో సారి గెలవాలని ప్రచారంలో దూసుకెళ్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఈ సారి తమకు కలిసొస్తుందని యాంటీ ఇన్ కంబెన్సీతో అధికారం తమదేనని ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా ఏ పార్టీని రెండు సార్లు గెలిపించని రాష్ట్రంలోని ఆ 27 సెగ్మెంట్లపై హస్తం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2009, 2018లో ఈ స్థానాల్లో సిట్టింగ్‌ను ఓటర్లు మారుస్తూ వస్తున్నారు. అక్కడ ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ 27 అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తూ వస్తున్నారు. 2009 నుంచి వస్తున్న ఈ ట్రెండ్ ఈసారి తమకు కలిసివస్తుందని హస్తం పార్టీ భావిస్తోంది.
రంగంలోకి స్ట్రాటజీ టీమ్స్!
ఇప్పటికే ఈ 27 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ తమ స్ట్రాటజీ టీమ్‌లను రంగంలోకి దించింది. ఈ టీమ్‌లు స్థానిక లీడర్లు, పార్టీ వర్కర్లతో గెలుపునకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తోంది. ఆయా స్థానాల్లో మైక్రో లెవల్ బూత్ మేనేజ్‌మెంట్ చేస్తే ఫలితం ఉంటుందని స్థానిక నేతలను గైడ్ చేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వాడుకోవాలని స్కెచ్ వేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే ఈ స్థానాలు కీలకమని.. గెలుచుకుంటే అధికారం తమదేననే ధీమాలో టీ- కాంగ్రెస్ ఉంది. 27 స్థానాల్లో కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో కొత్తగూడెం, ములుగు, తాండూరు సెగ్మెంట్లను గెలుచుకుంది. ఈ సారి కొత్తగూడెం టికెట్‌ను కాంగ్రెస్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కేటాయించింది. ఇక, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సారి ఈ మూడు స్థానాలను ఎలాగైనా తిరిగి గెలిచి నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 27 సెగ్మెంట్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందులో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఆ 27 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే..!
హైదరాబాద్ పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లిలో వరుసగా రెండు సార్లు ఏపార్టీ గెలవలేదు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, వైరా, ఖమ్మం, కొత్తగూడెంలలో సైతం 2009, 20014లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు మార్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, మక్తల్, నల్గొండ జిల్లాలో దేవరకొండ, కరీంనగర్ జిల్లాలో రామగుండం, జగిత్యాల, వరంగల్ జిల్లాలో ములుగు, డొర్నకల్, నర్సంపేట, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, తాండూర్, పరిగిలతో వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు చేంజ్ చేస్తూ వస్తున్నారు. సరిగా ఇదే ట్రెండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వర్క్ అవుట్ అవుతుందని టీ-కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ స్ట్రాటజీ టీమ్‌లను దించింది. మరి కాంగ్రెస్ వేసిన ఈ నయా స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..? 27 స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేస్తుందా.. లేక బీఆర్ఎస్ ఆయా స్థానాల్లో రెండు పర్యాయాలుగా వస్తున్న ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తుందా..? అనేది మాత్రం మరో రెండు వారాల్లో తేలనుంది.