తెలంగాణలో 24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Satheesh |   ( Updated:2023-09-03 12:13:32.0  )
తెలంగాణలో 24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఐదారు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు కామారెడ్డి జిల్లాలో సబ్ స్టేషన్ల ముట్టడికి యత్నించారు. దీనిపై ‘‘దిశ’’ పేపర్‌లో వచ్చిన వార్తలపై ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిచారు.

‘ఇది కూడా తెలంగాణ మోడల్‌లో భాగమేనా ?? 24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం, కనీసం ఐదు, ఆరు గంటల కరెంట్ ఇవ్వడం లేదు అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్లు ముట్టడి చేస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతు కరెంట్ కోసం రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏంటి ? కరెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, ఇదేనా కిసాన్ సర్కార్ ??’ అంటూ రఘునందన్ రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story