- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్‌లో ఆర్టీసీకి 2 శాతం నిధులు కేటాయించాలి: RTC JAC
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2023-24 వార్షిక బడ్జెట్‌లో ఆర్టీసీకి 2 శాతం నిధులు కేటాయించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఎల్లుండి) డిమాండ్స్ డే బ్యాడ్జీలతో విధులు నిర్వహించి నిరసన తెలిపేందుకు జేఏసీ నిర్ణయించుకుంది. మునుగోడు బైపోల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేతన సవరణలు చేయవలసి ఉండగా ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వేతన సవరణ చేయడానికి మునుగోడు బై ఎలక్షన్స్ కోడ్ నుండి మినహాయింపు ఇవ్వాలని లెటర్ రాసినామన్న జేఏసీ.. ప్రభుత్వం కోడ్ ముగిసి 70 రోజులైన పట్టించుకోకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. వెంటనే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా, ఆర్టీసీలో వెల్ ఫేర్ కమీటీలను రద్దు చేసి యూనియన్లకు అనుమతిస్తూ తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. సీసీఎస్‌కు చెల్లించవలిసిన డబ్బులు పీఎఫ్, ఎస్ఆర్బీఎస్ కు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలని కోరింది. మరోవైపు, కార్మికులపై పనిభారాలను తగ్గించాలని.. వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో/యునిట్లలో డిమాండ్స్ డే బ్యాడ్జీ ధరించి విధులు నిర్వహించి విజయవంతం చేయాలని కె. రాజిరెడ్డి చైర్మన్, వి.ఎస్. రావు కన్వీనర్, కత్తుల యాదయ్య, జెఏసి కో చైర్మన్ పిలుపునిచ్చారు.
READ MORE
కొన్నేళ్ల నుంచి కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: ఆర్టీసీ చైర్మన్