BREAKING: రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.2లక్షల రుణమాఫీ నిధుల జమకు డేట్ ఫిక్స్

by Satheesh |   ( Updated:2024-07-16 12:04:10.0  )
BREAKING: రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.2లక్షల రుణమాఫీ నిధుల జమకు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ నిధుల జమ ప్రాసెస్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. 18వ తేదీ సాయంత్రం లోగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వెల్లడించింది.

అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహిస్తామని పేర్కొంది. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల హాజరు అవుతారని తెలిపింది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను సోమవారం విడుదల చేసిన సర్కార్.. ఈ నెల 18నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్ట్ 15 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed