ఆయన శిష్యుల్లో 150 మందికి సివిల్స్ ర్యాంకులు.. ఇంతకు ఆయనెవరో తెలుసా?

by Javid Pasha |
ఆయన శిష్యుల్లో 150 మందికి సివిల్స్ ర్యాంకులు.. ఇంతకు ఆయనెవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడి చదివితే తప్ప ఆ పరీక్షలో ర్యాంకులు రావు. అందుకే ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ ఆ కలను కొంతమంది మాత్రమే నిజం చేసుకుంటారు. కాగా ఇవాళ యూపీఎస్సీ అధికారులు సివిల్స్ ఫలితాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది సివిల్స్ కు ఎంపికయ్యారు. అందులో 4 స్థానాలను మహిళలే కైవసం చేసుకోగా.. ఇషితా కిషోర్ మొదటి ర్యాంకు, గరిమా లోహియా 2వ ర్యాంకు సాధించారు.

అయితే ఈ 933 మంది అభ్యర్థుల్లో 150 మందికి రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ గైడెన్స్ ఇచ్చారు. తాను ఇంటర్వ్యూకు గైడెన్స్ ఇచ్చిన వాళ్లలో అంత మంది ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇక అంతకు ముందు సివిల్స్ ఫలితాల్లో కూడా మహేశ్ భగవత్ శిష్యులు చాలా మంది సివిల్స్ కు ఎంపికయ్యారు. ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా ఆయన శిష్యులు సివిల్స్ లో మెరిశారు. ఇక 1993 సివిల్స్ పరీక్షలో మహేశ్ భగవత్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. దాంతో ఆయన చాలా కృంగిపోయారు. కానీ మరుసటి ఏడాది కష్టపడి చదివి సివిల్స్ కు సెలెక్ట్ అయ్యారు.

అయితే సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే తాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాయని, తన పరిస్థితి ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతోనే 2014 నుంచి సివిల్స్ అభ్యర్థులకు మెంటర్ గా వ్యవహరిస్తున్నట్లు చాలా సందర్భాల్లో మహేశ్ భగవత్ తెలిపారు. ఇక మహేశ్ భగవత్ ను సోషల్ మీడియాలో ఆకాశానికెత్తుతున్నారు. ‘నిజంగా మీర్ గ్రేట్ సార్.. అంత మంది సివిల్స్ కు ఎంపికయ్యేట్లు చేసిన మీకు ధన్యవాదాలు’’ అంటూ కొనియాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed