రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు!

by Ramesh N |   ( Updated:2024-04-08 09:08:35.0  )
రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతుల సమస్యలు, పంటపొలాలపై సోమవారం బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా వివరాలు తెలియజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం, అసమర్థ పాలనలో రాష్ట్రంలో సాగు నీళ్లు లేక 15 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు ఎండిపోయినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే రైతలకు దాదాపు రూ. 3 వేల కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపింది. సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని, రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువు పాలు అయ్యిందని పేర్కొంది.

ఎకరాకు కనీసం రూ. 25 వేల నష్టం.. పంట నష్టంపై ఇప్పటికీ కర్కశ ప్రభుత్వం స్పందించలేదని వెల్లడించింది. పంటలు ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి పోయి అప్పులపాలై ఆర్థికంగా రైతులు కుంగిపోయారని తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుందని వెల్లడించింది.

Advertisement

Next Story