Tenth Exams.. 5 నిమిషాలు ఆసల్యమైనా అనుమతించిన అధికారులు

by Hamsa |
Tenth Exams.. 5 నిమిషాలు ఆసల్యమైనా అనుమతించిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నేడు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజు కావడంతో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష హాలులోకి అధికారులు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4. 94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారి కోసం పాఠశాల విద్యాశాఖ 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 13వ తేదీ వరకు మొత్తం 6 పేపర్లతో పరీక్షలు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కాగా, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని మంత్రి సబిత సూచించగా, జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed