సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..

by Kalyani |
సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..
X

దిశ, కొండపాక: కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన పర్వతంరాజు (28), ఆటో నడుపుకుంటూ చిన్నకిష్టపూర్ నుంచి కుకునూర్ పల్లికి వస్తుండగా మార్గ మధ్యలో ఆకస్మాత్తుగా చాతి నొప్పి రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న కరణ్ రెడ్డి అనే వ్యక్తి 108 కి సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న కొండపాక 108 సిబ్బంది బైండ్ల మహేందర్ పైలెట్ పంజాల రమేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించగా అతనికి గుండె నాడి కొట్టుకోవడం లేదని గమనించారు.

వెంటనే మెడికల్ టెక్నీషియన్ మహేందర్ ఆ వ్యక్తికి సీపీఆర్ చేయగా అతడికి నాడి కొట్టుకోవడం తిరిగి ప్రారంభం అయింది. వెంటనే 108 లో కాల్ సెంటర్ లో డాక్టర్ మహీత్ కి చెప్పి అతడి సూచనల ప్రకారం ప్రథమ చికిత్స చేస్తూ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వ్యక్తి ప్రాణాలు కాపాడిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్ పైలెట్ రమేష్ లను బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed