కేంద్ర కీలక నిర్ణయం.. వికారాబాద్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు రిలీజ్

by Mahesh |
కేంద్ర కీలక నిర్ణయం.. వికారాబాద్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని పర్యాటకంగా ఎదిగేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న వికారాబాద్.. అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ నిధులు విడుదల చేసింది. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ధారూర్ మండలం కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌లో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరిని పర్యాటక అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని ఉద్యోగులందరూ వికెండ్ వచ్చిందంటే చాలు ప్రశాంతంగా గడిపేందుకు వికారాబాద్ హిల్స్ బాట పడుతున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed