- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TU : ఈనెల 19 నుంచి పీజీ పరీక్షలు..
దిశ, నిజామాబాద్ రూరల్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కాలేజీల్లో మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా పుణ్యమా అని వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఈనెల 19 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు వెల్లడించారు. యూనివర్శిటీ అనుబంధ కాలేజీల్లోని కోర్సుల ప్రకారం.. (పోస్టు గ్రాడ్యుయేట్) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ, ఎపీఇ, ఐఎంబీఏ, ఐపీసీహెచ్, ఎల్ ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఎగ్జామ్స్ ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.
అంతేకాకుండా, తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో-8, ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలో -6.. మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనే వెసలుబాటును కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియను త్వరలోనే వెబ్ సైట్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇకపోతే పరీక్షా కేంద్రాల్లో కొవిడ్- 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించవచ్చన్నారు.