నిన్న నియామకం.. నేడు తొలగింపు.. దేత్తడికి షాక్

by Shyam |   ( Updated:2021-03-09 05:10:00.0  )
నిన్న నియామకం.. నేడు తొలగింపు.. దేత్తడికి షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో తెలంగాణ యాసతో పాపులర్ అయిన దేత్తడి హారిక.. తన వీడియోల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్- 4లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూాడా తన డ్యాన్స్‌లతో రెచ్చిపోయింది. ఆమె డ్యాన్సులకు ఎంతోమంది అభిమానులయ్యారు. అయితే ఈమెను సోమవారం టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టూరిజం డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియామక పత్రం కూడా అందించారు.

కానీ ఏమైందో ఏమో కానీ, ఇవాళ హారికను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించారు. టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎంవో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హారికను శ్రీనివాస్ గుప్తా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. దీంతో శ్రీనివాస్ గుప్తాపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. మంత్రి, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని ఎలా నియమిస్తారని మందలించారు.

ఉప్పల శ్రీనివాస్ కుటుంబానికి హారిక దగ్గర బంధువు అని, అందుకే ఎవరికీ చెప్పకుండా టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story