రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణ

by Anukaran |
రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమైక్యరాష్ట్రంలోనే నదుల నీటి వాటా విషయంలో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఈ అంశాన్ని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా పేర్కొన్నారని సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను, పిలిచిన టెండర్ల ప్రక్రియను తక్షణం రద్దు చేస్తూ స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. తద్వారా తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది.

వాస్తవానికి ఈ దిశలో ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇప్పటికే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కిందకు వస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఏపీ డీపీఆర్ లు సమర్పించాలి, విధిగా అనుమతులు పొందాలి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటి పెండింగ్ ప్రాజెక్టులనే పూర్తి చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed