- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: స్టాఫ్ నర్సులకు నియామక ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మొత్తం 3,311 పోస్టులకుగాను 2,418 మంది అర్హత సాధించగా జోన్-5, జూన్-6 పరిధిలోని ప్రజారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల్లో భర్తీకి 1,415 మంది అర్హులైనవారికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి రెండు రోజులు జోన్-5లోని పోస్టుల భర్తీకి ప్రతీ రోజు ఐదు సెషన్ల చొప్పున కౌన్సిలింగ్ జరగనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి జోన్-6 పరిధిలోని పోస్టుల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుంది. ఖాళీగా ఉన్న పోస్టులు, అభ్యర్థుల ఆప్షన్లు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్‌పై నిర్ణయం జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకు (ఆదివారం మినహా) ప్రతీ రోజు సగటున 240 మందికి కౌన్సిలింగ్ నిర్వహించేలా షెడ్యూలు ఖరారైంది.
అర్హులైన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌కు హాల్ టికెట్ మొదలు పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమోలను, కుల ధృవీకరణ పత్రాలను, బిఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం డిప్లొమా ఉత్తీర్ణత సర్టిఫికెట్లను, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్టిఫికెట్‌ను, ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను వెంట తీసుకురావాల్సిందిగా సూచించారు. ఏడు రోజుల కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరి రోజునే అందరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఇవ్వనున్నట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కోఠీలోని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 3,311 స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017లో నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలూ జరిగాయి. సుమారు పాతిక వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. చివరకు 2,418 మంది అర్హత సాధించారు. వెయిటేజీ మార్కుల విషయంలో కమిషన్ నిబంధనలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వాటి విచారణ కోసం రెండేళ్ల సమయం పట్టింది. చివరకు ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకున్నది. ఇక పది రోజుల్లో వారికి జారీ అయిన పోస్టింగ్ ప్రకారం విధుల్లో చేరే అవకాశం ఉంది.