మరో రూ.2వేల కోట్ల బాండ్లు అమ్మిన కేసీఆర్ సర్కార్

by Shyam |
మరో రూ.2వేల కోట్ల బాండ్లు అమ్మిన కేసీఆర్ సర్కార్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా మరోసారి అప్పు చేసింది. ఓపెన్ మార్కెట్‌లో బాండ్లు అమ్మి రూ.2000 కోట్లు సేకరించింది. ఇందులో 2025 సంవత్సరానికి మెచ్యూరిటీ అయ్యే బాండ్లు అమ్మి రూ.1000 కోట్లు, 2026 వరకు కాలపరిమితి కలిగిన బాండ్లు విక్రయించి మరో రూ.1000 కోట్లు సేకరించింది. 2025 బాండ్ల కొనుగోలుకు 17కాంపిటీటివ్ బిడ్లు రాగా, 2026 బాండ్లకు కేవలం 2 కాంపిటీటివ్ బిడ్లు మాత్రమే వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లోనే తెలంగాణ ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా రూ.4000 కోట్లు అప్పు తీసుకుంది. కరోనా వైరస్ నిరోధానికి అమలు చేసిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తాము చేసే ద్రవ్యలోటు అప్పులను ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో గతేడాది కంటే ఎక్కువగా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఇప్పటికే అనుమతిచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed