- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెలు హిట్.. ఇక పట్టణాలపై లుక్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పల్లె ప్రగతి సక్సెస్‌తో పట్టణ ప్రగతిపై లుక్కేసిన సర్కార్ మరో హిట్ కోసం ఉవ్విళ్లూరుతోంది. మున్సిపల్ ఎలక్షన్ టైంలో పట్టణ ప్రగతి చేపడుతామన్న హామీతో తిరుగులేని విక్టరీ కొట్టిన అధికార పార్టీ ఆ దిశగా అడుగులు స్టార్ట్ చేసింది. నేటి నుంచి మార్చి 4 వరకు పదిరోజులు 128 మున్సిపాలిటీలు, 13 నగర పాలక సంస్థల్లో కార్యక్రమాలు చేపట్టి సిటీస్‌ను ఎక్సలెంట్‌గా రెడీ చేయాలన్న టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు చేశారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికబద్ధమైన డెవలప్‌మెంట్ కోసం డివిజన్లవారీగా కలియ తిరిగారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కలిసి పాత తోట రోడ్డులో పాదయాత్ర చేశారు. ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చొని వృద్ధులతో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, పట్టణాల్లో చేపట్టబోతున్న ప్రగతిపై వారికి వివరించారు. అటు సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, సూర్యాపేట రెండో వార్డులో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని పారిశుధ్యం, పచ్చదనం, పట్టణ స్థాయి కార్యచరణ, విద్యుత్ అంశాలను గుర్తించారు. స్థానికులతో మాట్లాడి అందుతున్న పథకాలపై ఆరా తీశారు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ టూర్‌లో ఏబీవీపీ నిరసన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. డైట్ కాలేజీ ప్రాంగణంలో మార్కెట్ యార్డు ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్ చేసి, వినతిపత్రం సమర్పిస్తామంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిపై విపక్షాలు కౌంటర్ ఇస్తూ నిరసనలు సైతం తెలిపాయి. మల్కాజిగిరిలో ఎంపీ రేవంత్‌రెడ్డి పట్నం గోస కార్యక్రమం చేపట్టారు. భూదేవినగర్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి పేరుతో మరోసారి మెసం చేయడానికి కేటీఆర్ పాలమూరు వెళ్లారని, పాలమూరు బతుకులు అంటే పరాచకమైందని విమర్శించారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని మోసం చేశారని విరుచుకుపడ్డారు. అటు కరీంనగర్‌లో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమ ఫ్లెక్సీపై ఎంపీ బండి సంజయ్ ఫొటో ఎందుకు పెట్టలేదని ఆందోళనకు దిగారు. స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచే డబ్బులు వస్తున్నా ఎంపీ ఫొటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
Read Also..