- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైటెక్ హంగులతో తెలంగాణ సెక్రటేరియట్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా హైటెక్ హంగులతో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల పాటు సేవలు అందించేలా పక్కా వాస్తు ప్రకారం భవనాల డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దాదాపు 25ఎకరాల్లో 6 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారు. 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉండేలా డిజైన్ చేశారు. తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా ప్లాన్ చేయడంతో పాటు సచివాలయంలోనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక గదులతో పాటు మినిష్టర్ పేషీలోనే ఆ శాఖ కార్యదర్శి, మంత్రి పేషీ ఉండేలా చూస్తున్నారు. వెయ్యిమంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, సచివాలయంలోనే గుడి, బ్యాంక్, ఏటీఎంలు ఉండేలా ప్లాన్ రూపొందించారు.
Advertisement
Next Story