టీఆర్ఎస్ నేతలకు అర్హత లేదు.. ఉద్యమకారుడి విమర్శ

by Sridhar Babu |
Telangana movement leader Hariprasad
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్‌కు వచ్చిన ఓట్లను చూసి టీఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించిందని తెలంగాణ ఉద్యమ నేత గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దొంగే దొంగ-దొంగ అని అరిచినట్లుగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నైతికత గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదని, గతంలో సునీల్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉండి కార్పొరేటర్‌గా గెలిచి, టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం మర్చిపోయాడని ఎద్దేవా చేశారు.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా 232 ఓట్లు తెచ్చుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ల, కౌన్సిలర్ల, అభిమానాన్ని రవీందర్ సింగ్ పొందడం టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదని, అందుకే కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మేయర్‌కు ఎన్నికలపై ఉన్న సోయి కరీంనగర్ అభివృద్ధిపై లేదని, నగరానికి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఘనత రవీందర్ సింగ్‌దే అని అన్నారు. మేయర్‌గా సునీల్ రావు బాధ్యతలు చేపట్టిన అనంతరం, బల్దియాలో పనిచేయడానికి అధికారులు భయపడుతున్నారని, దీనికి మేయర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలు తప్ప, అభివృద్ధి అలోచన లేదని, ఇప్పటికైనా నగర పురోగతిపై దృష్టి సారించాలని హితువు పలికారు. ఈ సమావేశంలో తిరుపతి, రాము, నర్సింహులు, చంద్ర శేఖర్, కుమార్, రాజు, భాస్కర్, నర్సయ్య, శ్రావణ్, జయంత్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story