- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పష్టతలేని మెజారిటీ.. ఫోకస్ అంతా రెండో ప్రాధాన్యత ఓట్లపైనేనా?
దిశ ప్రతినిధి,నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్ల కౌంటింగ్ ముగియగా, మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏడు రౌండ్లుగా సాగుతుంది. ఇందులో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యతలుగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక్కో రౌండు లెక్కించేందుకు 5 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇలా ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు గురువారం సాయంత్రం అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకే ఇంత సమయం పడితే.. కౌంటింగ్ మొత్తం పూర్తి కావాలంటే చాలా సమయం అవసరమవుతుంది.
రెండో ప్రాధాన్యత లెక్కింపు..
ఇదిలావుంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే వచ్చిన తొలి, రెండో రౌండ్ ఫలితాల్లో దాదాపు 1.12(ఒక్కో రౌండ్‌కు 56వేల ఓట్లు) ఓట్లలో మొదటి స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి రెండు రౌండ్లలో కలిపి 31,987 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు రెండు రౌండ్లలో 24116 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే.. ఏడు రౌండ్లు ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో అభ్యర్థి గెలుపునకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం అయ్యింది. ప్రస్తుత కౌంటింగ్ సరళిని చూస్తే.. రెండో ప్రాధాన్యతలోనూ ఏ అభ్యర్థికి మెజార్టీ దక్కే పరిస్థితి లేదు. నిజంగానే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఏ అభ్యర్థికి మెజార్టీ రాకపోతే.. మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అంతకంటే ముందే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది.