- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం.. ఎందుకో తెలుసా..!
దిశ ప్రతినిధి, వరంగల్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వపు సంపద గుర్తింపు కోసం (యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్) తెలంగాణ మంత్రుల బృందం బుధవారం ఢిల్లీకి పయనమైంది. వీరంతా వారసత్వపు గుర్తింపు హోదా కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసేందుకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసన మండలి సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, కాకతీయ హెరిటేజ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎమ్. పాండు రంగారావు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డిలు ఉన్నారు. ఈ బృందం ఇవాళ సాయంత్రం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.
ములుగు జిల్లా పాలంపేటలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యూనెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా ప్రకటించేలా కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెమోరాండం సమర్పించడానికి వెళ్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించడానికి కావాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చిందని, వీలైనంత త్వరగా రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ స్థలంగా ప్రకటించేలా తమ వంతు ప్రయత్నం చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రకటించారు.