- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ఒమిక్రాన్.. వైద్యశాఖ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది ఒమిక్రాన్ వైరస్. ఇప్పటికే భారత్‌లో కూడా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక, గుజురాత్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, తాజాగా ఢిల్లీలో కూడా ఒక కేసు నమోదైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆదివారం రాష్ట్ర వైద్యశాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
అయితే ఇటీవల విదేశాల నుంచి తెలంగాణ కు వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిపింది. అంతే కాకుండా 13మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారని, ఈ రోజు సాయంత్రానికి రిపోర్టులు రానున్నాయని పేర్కొంది. అలాగే రేపోమాపో తెలంగాణకు కూడా ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావచ్చునని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైద్యశాఖ తెలిపింది. ఈ ఒమిక్రాన్ ఫిబ్రవరిలో పీక్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉందన్నది. తీవ్రమైన తల నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఒమిక్రాన్ వైరస్ లక్షణాలని వీటిని గుర్తించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.