- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి 31 వరకే ‘ప్రైవేటు’ జీతాల చెల్లింపులా ?
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వచ్చే నెల 15 వరకు ‘లాక్ డౌన్’ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగానే చెప్పింది. ఈ నెల 31 వరకూ పెట్టిన ఆంక్షలు వచ్చే నెల 15 వరకూ కొనసాగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీని వెలుగులో రాష్ట్ర కార్మిక శాఖ కూడా ఒక నోటిఫికేషన్‌ను వెలువరించింది. లాక్‌డౌన్ కాలంలో ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి కాబట్టి అందులో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు శనివారం విడుదల చేసిన జీఓ (నెం. 161)లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన ‘జనతా కర్ఫ్యూ’ మొదలు తెలంగాణ ప్రభుత్వం తొలుత ప్రకటించిన మార్చి 31వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వచ్చే నెల 15వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నందున అప్పటివరకూ పరిశ్రమలు తెరవడానికి వీల్లేదు. దీంతో ఆ పద్నాలుగు రోజులకు వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయనే దానిపై రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ జీవోలో ప్రకటించలేదు.
దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ పరిశ్రమలు వచ్చే నెల 15 వరకూ మూతపడే ఉంటాయి. అవి పనిచేయడానికి వీలు పడదు. కాబట్టి అందులో పనిచేస్తున్న కార్మికులు విధులకు హాజరుకావడం కుదరదు. కానీ తెలంగాణ కార్మిక శాఖ ఇచ్చిన జీఓలో మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే వేతనంతో కూడిన సెలవులు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్ నెలలో 15 రోజుల ప్రస్తావన లేనందువల్ల ప్రైవేటు ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్లో కొత్త గందరగోళం తలెత్తే అవకాశం ఏర్పడింది. ఏప్రిల్ నెల 15 రోజుల కోసం మరో జీవో జారీ అవుతుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ జీఓ జారీచేసేనాటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా ‘లాక్‌డౌన్’ వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చినప్పుడు కార్మికశాఖ మార్చి 31 వరకే ‘వేతనంతో కూడిన సెలవులు’ అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ ఇచ్చిన జీఓ మేరకే ప్రైవేటు ఫ్యాక్టరీల యాజమాన్యం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చి ఊరుకుంటుందేమో! వచ్చే నెలలో జరిగే లాక్‌డౌన్ పనిదినాలకు సంబంధం లేదని తప్పుకుంటాయేమో.. ఇలాంటి ఆందోళన ఇప్పుడు కార్మికులను వేధిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా ఏప్రిల్ నెలలోని 15 రోజుల ప్రస్తావన లేనందువల్ల ఉపాధి, జీతం లేకుండా అర్ధాకలితోనే ఉండాల్సి వస్తుందేమో అనే భయం వారిని పీడిస్తోంది. నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన ఫ్యాక్టరీలు యధావిధిగా పనిచేయడానికి అనుమతి ఉన్నందున వాటిల్లో పనిచేసే కార్మికులకు ఏ ఆందోళనా లేదు.
కానీ నిత్యావసరాలతో సంబంధం లేని ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మినరల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు… ఇలా అనేక రకాల కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు మాత్రం గందరగోళంలోనే ఉన్నారు. ”రాష్ట్రంలోని ఏ ఒక్కరూ పస్తులుండాల్సిన పనిలేదు… అందరి కడుపు నింపుతాం… కార్మికులకు కూడు, గూడు, నీరు, ఆరోగ్యం తదితర అవసరాలను తీరుస్తాం..” అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినందువల్ల ఏప్రిల్ 15 వరకూ ఫ్యాక్టరీలు మూతపడితే వారి వేతనాలపై మున్ముందు కేసీఆర్ ఎలాంటి స్పష్టత ఇస్తారనేదానిపైనే కార్మికులు నమ్మకం పెట్టుకున్నారు.
Tags: Telangana, Labour, Paid Holidays, Corona, LockDown, March 31, April 15, GO