తెలంగాణ స్పూర్తి ప్రధాత ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ : మంత్రి హరీశ్

by Shyam |
minister harish rao
X

దిశ‌, అందోల్: తొలి ద‌శ‌, మ‌లిద‌శ తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాత, తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో కేసీఆర్ ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. జ‌య‌శంక‌ర్ 10వ వ‌ర్థంతి సంద‌ర్భంగా సోమ‌వారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వ‌ద్ద ఏర్పాటు చేసిన చిత్రప‌టానికి ఎంపీ బీబీపాటీల్‌, ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌ల‌తో క‌లిసి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి ద‌శ ఉద్యమం నుంచి తెలంగాణ‌కు జ‌రుగుతున్న ఆన్యాయాన్ని, వివ‌క్షను పుస్తక, వీడియో రూపంలో మ‌లిద‌శ ఉద్యమానికి అందించిన గొప్ప వ్యక్తి జ‌య‌శంక‌ర్ సారేన‌న్నారు.

తెలంగాణ భావాజాలాన్ని మేధావులకు, విద్యావేత్తల‌కు, నాయ‌కులకు, క‌ర్షక‌, కార్మిక లోకానికి అవ‌గాహ‌న క‌ల్పించార‌న్నారు. తెలంగాణ ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యమ‌వుతున్న న‌మ్మకంతో 2001 నుంచి కేసీఆర్ కు అండ‌గా నిలిచి, వెన్నంటే ఉన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియ‌మాకాలు అనే నినాదాంతో ఉద్యమాలు చేప‌డితే, ప్రజ‌లంద‌రి స‌హ‌కారంతో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైంద‌న్నారు. నీళ్లు వ‌చ్చినందునే గ‌డిచిన పంట కాలంలో 3 కోట్ల మెట్రీక్ ట‌న్నుల ధాన్యాన్ని పండించి, దేశంలోనే అగ్రగామిగా మ‌న రాష్ర్టం నిలిచింద‌న్నారు. నిధులు ఉన్నందునే క‌రోనా లాంటి విప‌త్కర ప‌రిస్థితుల్లో వానాకాలం పెట్టుబ‌డి కోసం రైతుల‌కు రూ.7500 కోట్లను రైతుబంధు ప‌థ‌కం కింద రైతుల ఖాతాల్లో జ‌మ‌చేశామ‌న్నారు.

జ‌య‌శంక‌ర్ స్పూర్తితో సంక్షేమం, అభివృద్ది ప‌నులను చేప‌డుతున్నామ‌న్నారు. అంత‌కుముందు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌ల కేంద్రాల‌లో జ‌య‌శంక‌ర్ వ‌ర్థంతిని జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్య‌ద‌ర్శి భిక్షప‌తి, జోగిపేట‌, వ‌ట్‌ప‌ల్లి, మార్కెట్ క‌మిటీల చైర్మన్‌లు మ‌ల్లిఖార్జున్‌, ర‌జ‌నీకాంత్‌, మున్సిప‌ల్ చైర్మన్ మ‌ల్లయ్య, ఎంపీపీ బాల‌య్య, జిల్లా రైతు స‌మ‌న్వయ‌స‌మితి స‌భ్యుడు లింగాగౌడ్‌, వైస్ చైర్మన్ ప్రవీణ్‌, చేనేత సంఘం మాజీ చైర్మన్ స‌త్యం, అత్మక‌మిటీ డైరెక్టర్ మ‌హేశ్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed