ఆగని కరోనా వ్యాప్తి.. ఇవాళ 2,534కేసులు..!

by Shyam |   ( Updated:2020-09-09 22:49:37.0  )
ఆగని కరోనా వ్యాప్తి.. ఇవాళ 2,534కేసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 2,534 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176 కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 32,106 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జి అయిన సంఖ్య 1,17,143 చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. తాజా మరణాలు కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 927 కు చేరింది. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 19,53,571కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story