కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక రూల్స్

by Shyam |
కరోనా మృతుల  అంత్యక్రియలకు ప్రత్యేక రూల్స్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలతో కూడిన ఒక మెమో జారీ చేసింది. మరణించిన కరోనా రోగుల బాడీలను ఆస్పత్రిలో బంధువులు చూడటం దగ్గర నుంచి అంత్యక్రియలు జరిగే చోటుకు తీసుకెళ్లే వరకు ఏయే నియమాలు పాటించాలో స్పష్టంగా పేర్కొంది. రోగి చనిపోయినప్పటి నుంచి బాడీని ఎలా ప్యాక్ చేయాలి, ఎలా ట్రాన్స్ పోర్ట్ చేయాలి, శ్మశానంలో దహనం లేదా ఇతర తంతులు ఎలా పూర్తి చేయాలన్నదానిపై ఆస్పత్రి డాక్టర్ల దగ్గర నుంచి జీహెచ్ఎంసీ అధికారుల దాకా అందరికీ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. కరోనా రోగుల డెడ్ బాడీలను హ్యాండిల్ చేసే విషయమై ప్రతి ఆస్పత్రిలో నియమితులయ్యే కొవిడ్ లైజనింగ్ ఆఫీసర్లు ఆ ఏరియా జీహెచ్ఎంసీ ఉప కమిషనర్‌తో కోఆర్డినేట్ చేసుకోవాలని కోరింది. మరణించిన వ్యక్తుల బంధువులతో సహా ప్రతి దశలో ఇందుకు సహకరించే సిబ్బంది రోగి బాడీకి దూరంగానే ఉండాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరింది. హిందూ మతంతో పాటు క్రిస్టియన్, ముస్లిం మతాల వారికి ఆయా మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేసుకుంటూనే నిబంధనలు పాటించాలని సూచించింది.

Tags: corona dead bodies, telangana, cremation guidelines, special rules

Advertisement

Next Story

Most Viewed